![]() |
![]() |
.webp)
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ఫ్రెండ్ షిప్ థీమ్ తో రాబోతోంది. ఈ షోలో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని షోలోకి ఇన్వైట్ చేశారు. స్టేజి మీదకు తేజస్విని మడివాడ తన బెస్ట్ ఫ్రెండ్ అఖిల్ సార్థక్ ని తీసుకొచ్చింది. "నన్ను ఎవరన్నా ఏదన్న మాట అంటే అఖిల్ ఫస్ట్ ఫీలవుతాడు" అని తేజు ముద్దుగా గోముగా చెప్పేసరికి "అంతే కదా..తను నాకు ఫ్రెండ్ కాబట్టి నేనే ఫీలవుతాను" అని చెప్పాడు అఖిల్. "ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరీ వాళ్ళను తిడతా" అని చెప్పాడు అఖిల్. తర్వాత సుహాసిని - అంబటి అర్జున్ కలిసి వచ్చారు. "అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ ఫ్రెండ్ షిప్" అని అడిగింది శ్రీముఖి. "దేవత స్టార్ట్ అయ్యాక" అని అర్జున్ చెప్తుండగా "నీ లైఫ్ లో కి ఒక దేవత వచ్చింది కదా" అంది శ్రీముఖి.
దానికి అర్జున్ "అంత సీన్ లేదు" అని చెప్పేసరికి సుహాసిని సడెన్ అర్జున్ ముఖం చూసింది. "అబ్బాయిలు బెస్టా...అమ్మాయిలు బెస్టా ఫ్రెండ్ షిప్" అని శ్రీముఖి అమరదీప్ ని అడిగేసరికి "ఫ్రెండ్ షిప్పే బెస్ట్..అది అమ్మాయా, అబ్బాయా అని కాదు" అని చెప్పాడు. ఐతే అమరదీప్ ఫ్రెండ్ శోభా శెట్టి వచ్చింది స్టేజి మీదకు అలాగే విష్ణు ప్రియా కోసం రీతూ చౌదరి వచ్చింది...అలాగే జడ్జ్ అనసూయ కోసం ఆమె బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది. హమీద కోసం కాజల్ ఆర్జే, నిఖిల్ విజయేంద్ర సింహ కోసం దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక వచ్చింది. ఇక ప్రేరణ కోసం ఆమె ఫ్రెండ్ ప్రీతల్ "నువ్వు బ్రష్ చేసుకోలేదు యాక్" అంటోంది అనేసరికి ప్రేరణ శ్రీముఖి దగ్గరకు వచ్చి ఇంకేం చెప్పేద్దు అని చేతులు పట్టుకుంది. ఇలా రాబోయే వారం షో ఫ్రెండ్ షిప్ థీమ్ గా రాబోతోంది.
![]() |
![]() |